23 April, 2026 | 2:03 PM

Breaking News

మన్సాన్‌పల్లిలో అరైవ్ అలైవ్ కార్యక్రమం

23-04-2026 12:25 AM

కొండాపూర్, ఏప్రిల్ 22 :  కొండాపూర్ మండల పరిధిలోని మన్సన్ పల్లి గ్రామంలో బుధవారం అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ సోమేశ్వరి, సర్పంచ్ రాంచందర్ రెడ్డి గ్రామ పెద్దల సమక్షంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ  గ్రామ ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన ముఖ్యమైన నియమాలను వివరించి, హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్, ఉప సర్పంచ్ శివ శంకర్, వార్డ్ మెంబర్లు, పాఠశాల టీచర్లు డ్వాక్రా మహిళ సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.