23 April, 2026 | 12:28 PM

కారు, బైక్ ఢీకొని వ్యక్తి మృతి

23-04-2026 12:25 AM

వెల్దండ, ఏప్రిల్ 22: హైదరాబాద్‌ శ్రీశైలం జాతీయ రహదారిపై గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని పలుగు తండ బస్ స్టేజ్ సమీపంలో కారుద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో చట్టంలోని కృష్ణయ్య(38) అనే వ్యక్తి మృతి చెందాడు.

పోలీసుల వివరాల ప్రకారం, నాగర్కర్నూల్ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన చట్టమోని కృష్ణయ్య ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ వైపు వెళ్తుండగా, ఎదురుగా కల్వకుర్తి వైపు వస్తున్న కారు పలు గు తండ సమీపంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణయ్య అక్కడికక్కడే మృతి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్త్స్ర కురుమూర్తి తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.