28 March, 2026 | 8:18 PM

ఆశా కార్యకర్తల అరెస్టు తగదు

28-03-2026 06:03 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): సమస్యల పరిష్కారం, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరడానికి వెళ్లకుండా ఆశా కార్యకర్తలను అడ్డుకోవడం, అరెస్టు చేయడం తగదని సీఐటీయూ కార్యదర్శి సమ్మెట రాజమౌళి, ఏఐటీయూసీ జిల్లా నాయకులు మందశంకర్ అన్నారు. ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు హైదరాబాద్ కు శనివారం బయలుదేరిన ఆశ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య పద్ధతి కాదన్నారు.

క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందిస్తున్న ఆశా కార్యకర్తల డిమాండ్లను నెరవేర్చేది పోయి, ప్రభుత్వం దొడ్డి దారిన ఆశ కార్యకర్తలపై ఉక్కుపాదం మోపుతూ, ప్రజా ఉద్యమాలను ఆపాలని అనుకోవడం హాస్యస్పదంగా ఉందని వారు ఎద్దేవ చేశారు. ఇప్పటికైనా వారి యొక్క హక్కులను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసి వారి డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. నెలకు18 వేల రూపాయల వేతనం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం నేటికీ అమలు చేయలేదని విమర్శించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి కుంట్ల నాగన్న, మాధవి, ముల్క కళావతి తదితరులు పాల్గొన్నారు.