15 May, 2026 | 4:54 PM

జానకంపేట్ అష్టముఖి కోనేరు వద్ద ఏర్పాట్లు పూర్తి

15-05-2026 03:36 PM

బోధన్,(విజయక్రాంతి)ఎడపల్లి మండలం జానకంపేట్ శివారులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 16న అమావాస్య శనివారం సంవత్సరానికి ఒకసారి వచ్చే అష్టమి అమావాస్య రోజున ఇక్కడ పురస్కరించుకొని అష్టముఖి కొనేరులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దర్శనానికి వేలాదిగా భక్తులు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఇన్ఛార్జ్ ఈవో వేణు తెలిపారు. భక్తులు అష్టముఖి కొనేరులో స్నానాలు ఆచరించే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. శనివారం అమావాస్య కావడంతో ప్రతి సంవత్సరం అధిక భక్తులు వస్తుంటారు కాబట్టి తగు చర్యలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎండ తీవ్రత ఉండడంతో ప్రతి సమయపాలన పాటించాలని పేర్కొన్నారు.