1 April, 2026 | 10:44 PM

అర్జుగూడ ఎంపీపీఎస్ పాఠశాల వార్షికోత్సవం

01-04-2026 08:43 PM

వాంకిడి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని అర్జుగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్)లో వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాంకిడి మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) శివచరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడలు, వ్యాసరచన, వివిధ పోటీ పరీ క్షల్లోనూ ప్రతిభ కనబర్చాలని ఆయన సూచించారు. సమగ్ర అభివృద్ధి కోసం పాఠశాలలు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

అలాగే తల్లిదం డ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, నాణ్య మైన విద్యను పొందేలా చూడాలని కోరారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిన్నారుల ప్రతిభకు హాజరైన వారు అభినందనలు తెలిపా రు. ఈ కార్యక్రమంలో పాఠశా ల ప్రధానోపాధ్యాయురాలు చునార్కర్ ధర్మాబాయి, జడ్పీ హెచ్‌ఎస్ వాంకిడి కాంప్లెక్స్, ఖిరిడి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యా యులు నటరాజ్, ప్రభోద్ కుమార్, ఉప సర్పంచ్ దీపక్, వార్డు సభ్యులు శంకర్, సంధ్యారాణి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, జగదీష్, ప్రశాంత్, సిఆర్పీలు దుర్గం సందీప్, సునీల్, విజయబాబు, అంగన్వాడీ టీచర్ ప్రతిమతో పాటు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.