1 April, 2026 | 10:44 PM

అవినీతికి పాల్పడితే సహించేది లేదు

01-04-2026 09:27 PM

మున్సిపల్ చైర్మెన్ ప్రశాంత్ కుమార్

హుజురాబాద్,(విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలో అర్పిలు అవినీతికి పాల్పడితే సహించేది లేదని మున్సిపల్ చైర్మెన్ మొలుగు ప్రశాంత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ లు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో బుధవారం  అర్పిలతో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్, చైర్మెన్ మొలుగు ప్రశాంత్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డోర్ టూ డోర్ చెత్త సేకరణ, మున్సిపల్ అభివృద్ధిలో అర్పిల పాత్ర చాలా కీలకమైనదన్నారు. అర్పిలు సంఘాలకు బ్యాంక్ నుండి లోన్ ఇప్పించడం బాధ్యత అని వారు అన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. సంఘ సభ్యులు లోన్ ఇచ్చే ముందు డబ్బులు అడుగుతున్నారని మా దృష్టికి కానీ, ఏసీబీ అధికారులకు గానీ సమాచారం నేరుగా ఇవ్వవచ్చు అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, మెప్మా ఇంచార్జి టి.ఏం.సి మల్లీశ్వరి, సి.ఎల్.అర్పిలు, అర్పిలు, సమాఖ్య ఓబీల తో పాటు తదితరులు పాల్గొన్నారు.