1 April, 2026 | 10:50 PM

రామలింగేశ్వరస్వామి ఆలయంలో అన్నదానం

01-04-2026 08:46 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండల కేంద్ర శివారులో కొలువై ఉన్న శ్రీ శ్రీ ఉమా పృద్వి రామలింగేశ్వర స్వామి చతుర్ధ వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా బుధవారం అన్నదానం నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా వాయు లింగేశ్వర,పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్టించారు. ఆలయ కమిటీ చైర్మన్ నరాటి ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకులు బత్తుల అంజి,ములకలపల్లి ఉపసర్పంచ్ పువ్వాల లలితారావు,గాడి తిరుపతిరెడ్డి  శనగపాటి సీతారాములు,కుంచారపు శ్రీను, నరాటి రమేష్,శనగపాటి రవి, పాలకుర్తి సుమిత్,మేకల నరేష్,పద్దం బుజ్జి, కొదుమూరు గోపాల్, అనుముల సాయి,అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.