1 April, 2026 | 11:34 PM

సీసీ రోడ్లను ప్రారంభించిన రాయికోడ్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్

01-04-2026 09:37 PM

మునిప‌ల్లి,(విజయక్రాంతి): మండ‌ల ప‌రిధిలోని బోడపల్లి గ్రామంలో మంజూరైన సీసీ రోడ్డు ప‌నుల‌ను రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ ఆదేశాల మేర‌కు బుధవారం  రాయికోడ్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ సుధాక‌ర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండ‌ల అధ్య‌క్షుడు స‌తీష్ కుమార్, ప్రారంభించారు.  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సీసీ రోడ్డు మంజూరు చేసిందని తెలిపారు. పనులు సకాలంలో నాణ్యతతో చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో సర్పంచ్ గొల్ల అశోక్,మాజీ సర్పంచ్ విట్టల్ రెడ్డి వార్డ్ సభ్యులు, నాయకులు,  తక్కడపల్లి    సంగమేశ్వర్, శ్రీనివాస, బసంతి గౌడ్, వీరన్న, ఏసయ్య, గ్రామ ప్రజలు త‌దిత‌రులు పాల్గొన్నారు.