1 April, 2026 | 11:31 PM

కాంగ్రెస్ పాలనలో ప్రశ్నిస్తే దాడులు అరెస్టులు

01-04-2026 09:40 PM

* బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

* పార్టీ కార్యకర్తలు పరామర్శించిన ముఖ్య నేతలు 

అచ్చంపేట: ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలను అణచివేత దూరంతో వ్యవహరిస్తుందని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఎవరైనా అక్రమాలను ప్రశ్నిస్తే బెదిరింపులు అరెస్టులతో అణిచివేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల పైన దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల దాడికి గురైన బల్మూర్ మండలం జినుకుంట గ్రామ సర్పంచ్ రంగినేని పుష్పలత ప్రేమ్ కుమార్, అచ్చంపేట మండలం అంకిరోనిపల్లి సర్పంచ్ కొర్ర కమల, సతీష్ కుటుంబాలను వారి స్వగ్రామాలకు వెళ్లి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట పార్టీ సమన్వయకర్త మర్రి జనార్దన్ రెడ్డి కలిసి పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని వారికి ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.

పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోకల మనోహర్, అచ్చంపేట బిఆర్ఎస్ పార్టీ నేత శ్రీకాంత్ భీమా  కల్పించి, బాధిత మాట్లాడితే కేసులు, ప్రశ్నిస్తే దాడులు కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగుతున్నాయని, ప్రజలన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.