1 April, 2026 | 11:33 PM

పెద్దమల్లారెడ్డిలో ఇందిరమ్మ గృహప్రవేశం

01-04-2026 09:44 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఇందిరమ్మ నూతన గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందిరా కరణ్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు వస్త్రాలు సమర్పించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కోడూరి సాయగౌడ్, కార్యదర్శి పాత లక్ష్మీ, వార్డు సభ్యులు శ్రీనివాస్, నట్ట లింగం, నర్సింలు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు భాగా రెడ్డి,పార్టీ నాయకులు,ఇందిరమ్మ కమిటి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.