డంపింగ్ యార్డ్ ను తరలించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
బీఎస్పీ ఇంచార్జ్ డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు)
హుజురాబాద్,(విజయక్రాంతి): హుజురాబాద్ నుంచి డంపింగ్ యార్డ్ ను తరలించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి అంబాల ప్రభాకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాహుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డును బుధవారం ఆయన అఖిలపక్షనేతలతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డంపింగ్ యార్డ్ నుండి విడుదల అయ్యే విషవాయువుల వల్ల పరిసర గ్రామాల ప్రజలకే కాకుండా పంటలకు, వన్యప్రాణులకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి మరోచోటుకి మార్చాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు మంద సమ్మయ్య, బి.ఎస్.పి ఎమ్మెల్యే ఎంపీ కంటెస్టెంట్ అభ్యర్థి మారపల్లి మొగిలయ్య, అసెంబ్లీ కార్యదర్శి గరిక చంద్రయ్య, హుజురాబాద్ మండల ఇంచార్జ్ రామ్ శ్రీనివాస్, మండల అధ్యక్షులు కండె తిరుపతి, పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్, మామిండ్ల మల్లయ్య, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మంద జగన్, శనిగరపు రమేష్ తదితరులు పాల్గొన్నారు




