జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆర్చరీ పోటీలు
దోమకొండ, ఆగస్టు 26 (విజయక్రాంతి): ఆగస్టు 29న నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని దోమకొండ ఫోర్ట్లో ఆర్చరీ (విలువిద్య) పోటీలను ఘనంగా నిర్వహించారు. దోమకొండ ఫోర్ట్ మరియు విలేజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బాన్సువాడ జెడ్పీహెచ్‌ఎస్ తిర్మలాపూర్ క్యాంప్ విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి పోటీల్లో ఆకట్టుకున్నారు.
ఆర్చరీ కోచ్లు ప్రతాప్ దాస్, పీర్యా నాయక్ పోటీల నిర్వహణలో ముఖ్యపాత్ర పోషించారు. యువతలో క్రీడాస్ఫూర్తి, ఏకాగ్రత, క్రమశిక్షణతో పాటు క్రీడా ప్రతిభను పెంపొందించాలనే ఉద్దేశంతో ఆర్చరీ పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో మరింతగా రాణించాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు తిరుమల్ గౌడ్, కార్యదర్శి మోహన్ రెడ్డి, బాబ్జి, గణేష్ పాల్గొన్నారు.






