ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి
23-03-2026 04:47 PM
ప్రజావాణికి 96 దరఖాస్తులు
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లో ప్రజావాణి ద్వారా వచ్చిన 96 ధరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ... ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులలో అత్యంత ప్రాధాన్యతను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, జెడ్పి సీఈవో చందర్ నాయక్, ఆర్డిఓ వీణ, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.




