2 August, 2026 | 2:46 AM

19 నుంచి పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తులు

02-08-2026 12:20 AM

సెప్టెంబర్ 9 వరకు గడువు

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): తెలంగాణలో పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేం దుకు ప్రభుత్వం తేదీలు ఖరారు చేసింది. ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు పోలీస్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు లు స్వీకరించనున్నట్లు తెలిపింది. 7,437 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఇటీవల నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. పోలీస్, స్పెష ల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్), అగ్నిమాపక, జైళ్ల శాఖలకు సంబంధించి వేర్వే రుగా నాలుగు ప్రకటనలు విడుదల చే సింది. వీటిలో కానిస్టేబుల్, ఆ స్థాయి పో స్టులే దాదాపు 7 వేల వరకు ఉన్నాయి.