గ్రామపంచాయతీ రికార్డులు స్వాధీనం విచారణ
డీఎల్పిఓ హరి ప్రసాద్
బెజ్జూర్,(విజయ క్రాంతి): బెజ్జూర్ మండలంలోని సలగుపల్లి గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై డిఎల్పిఓ హరి ప్రసాద్ బుధవారం విచారణ చేపట్టారు. గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఫిర్యాదు మేరకు గ్రామపంచాయతీలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, వార్డు సభ్యుల సమక్షంలో విచారణ జరిపినట్లు తెలిపారు. అట్టి రికార్డులను సీజ్ చేసి స్వాధీనపరచుకొని జిల్లా కలెక్టర్ అందించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక అధికారి పాలనలోనే భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని పలువురు ఆరోపించారు.జిల్లా కలెక్టర్ పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటారని గ్రామపంచాయతీ నిధులు ఇష్టానుసారంగా ఉపయోగిస్తే శాఖపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్, సర్పంచ్ శ్రీహరి ఉప సర్పంచ్ రవీందర్ గౌడ్, కార్యదర్శి ధర్మయ్య, మాజీ సర్పంచ్ విశ్వేశ్వర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






