29 July, 2026 | 7:59 PM

Breaking News

బెల్లం రవాణా చేస్తున్న వాహనం స్వాధీనం   •   అటవీ జంతువుల ప్రాణాలే లక్ష్యం..   •   రామాయంపేటలో కొత్త పోలింగ్ బూత్‌లకు బీజేపీ డిమాండ్   •   కామారెడ్డి జిల్లా యోగ భవన్లో గురు పౌర్ణమి వేడుకలు   •   కేరళ గ్లోబల్ హైస్కూల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   విద్యార్థుల సమగ్ర వికాసమే ఉపాధ్యాయుల ఏకైక లక్ష్యం విద్యార్థుల వికాసం కోసం పనిచేయాలి   •   జూలై 30న సత్తుపల్లిలో ఎన్‌సీపీ - ఎన్‌డీఏ కూటమి (ఎన్‌వైసీ) రాష్ట్ర కార్యాలయం ప్రారంభం   •   పరిసరాల పరిశుభ్రతే ప్రజల ఆరోగ్యం   •   శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో గురు పౌర్ణిమ వేడుకలు   •   పలుగ్రామపంచాయతీలలో ప్రత్యేక సమావేశాలు   •  

సనత్‌నగర్‌లో దారుణం: అనుమానంతో భార్య హత్య

17-03-2026 05:57 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): సనత్‌నగర్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కత్తితో గొంతు కోసి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫతేనగర్ ప్రాంతానికి చెందిన వాసు (40), తన భార్య రేణుక (38)తో కలిసి నివసిస్తున్నాడు. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వాసు తరచూ గొడవలకు దిగేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మరోసారి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది.

ఆ వాగ్వాదం కాస్తా తీవ్రరూపం దాల్చడంతో కోపోద్రిక్తుడైన వాసు కత్తితో రేణుక గొంతు కోసి హత్య చేశాడు.హత్య అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలు, అనుమానాలే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.