29 July, 2026 | 6:58 PM

బాధిత కుటుంబానికి కొండంత అండగా నిలిచిన కోనప్ప

29-07-2026 06:09 PM

బెజ్జూర్,(విజయ క్రాంతి): బెజ్జూర్ మండలంలోని రేచని గ్రామంలో ఓ అనాధ పిల్లలకు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అండగా నిలిచారు. రేచిని గ్రామానికి చెందిన ఆదే భీమ్రావు తిరుపతమ్మ దంపతులు ఇటీవల మృతి చెందారు. దీనితో పిల్లలు అనాధలు అయ్యారు. ఇట్టి విషయం తెలుసుకున్న సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనాధ పిల్లలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు.

పిల్ల చదువు కోసం ప్రతి నెల రెండు వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్ గా బిఆర్ఎస్ పార్టీ తరపున 50 నెలల పాటు అందిస్తామని తెలిపారు. పిల్లలు ఉన్నత చదువులు చదివించి చదువు అనంతరం పెళ్లి చేసేందుకు కూడా అండగా ఉండి గ్రామ ప్రజల సహకారంతో పెళ్లి పెద్దగా ఉండి పెళ్లి జరిపిస్తానని హామీ ఇచ్చారు. పెద్ద మనసుతో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనాధ పిల్లలకు అండగా నిలవడంతో గ్రామ ప్రజలు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను అభినందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.