29 July, 2026 | 7:10 PM

సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

29-07-2026 06:20 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ములకలపల్లి మండల కేంద్రంలో ఉన్న సాయిబాబా ఆలయంలో బుధవారం ములకలపల్లి మాజీ జడ్పిటిసి సభ్యులు బత్తుల అంజి, భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా సాయిబాబా ప్రతిమకు పంచామృతాల అభిషేకం చేశారు.అనంతరం సాయిబాబా పుస్తకాలను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆశీస్సులు పొందుతూ జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

అనంతరం ఆలయంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గురువులు సమాజానికి జ్ఞానాన్ని, విలువలను అందించే మార్గదర్శకులని కొనియాడారు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ గురువుల పట్ల కృతజ్ఞతాభావం వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ ఉమా పృధ్వి రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ నరాటి ప్రసాద్, ములకలపల్లి  సర్ కోఆర్డినేటర్ సురభి రాజేష్,పాలకుర్తి సుమిత్,గాడి తిరుపతిరెడ్డి,బాల అప్పారావు, శనగపాటి రవి, కటికనేని ఆదిత్య,నరి మేకల,బాబా భక్తులు శనగపాటి సీతారాములు,బండి సత్యనారాయణరెడ్డి,కొదుమూరి మధు,కుంచారపు శ్రీనివాసరావు,పదం బుజ్జి, బిక్కుమళ్ళ సుధాకర్,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు.