28 April, 2026 | 7:48 AM

అపోలో 76వ స్మార్ట్ హాస్పిటల్ ప్రారంభం

28-04-2026 02:01 AM

హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఆధునిక వైద్యం

హైదరాబాద్, ఏప్రిల్ 27(విజయక్రాంతి): దేశంలో ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ మరో కీలక అడుగు వేసింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 400 పడకల సామర్థ్యంతో నిర్మించిన 76వ స్మార్ట్ హాస్పిటల్‌ను సోమవారం ప్రారంభించింది. ఈ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కూడా పాల్గొన్నారు.

10 అంతస్తుల ఈ స్మార్ట్ హాస్పిటల్ ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుని, అత్యవసర సేవలు, మల్టీ-స్పెషాలిటీ వైద్యం, వేగవంతమైన చికిత్సకు అనుకూలంగా రూపొందించ బడింది. కనెక్టెడ్ అంబులెన్స్ సేవలు, డిజిటల్ కేర్ వ్యవస్థలు, రియల్టైమ్ వైద్య సమన్వ యం వంటి సౌకర్యాలతో రోగులకు తక్షణ సేవలు అందించనుంది. తల్లి-శిశు సంరక్షణ, వృద్ధులకు ప్రత్యేక సేవలు, అంతర్జాతీయ రోగులకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా అం దుబాటులో ఉంటాయి.

అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మాట్లాడుతూ, దేశంలో అత్యాధునిక వైద్య సాంకేతికతలను, నిరోధక ఆరోగ్య సేవలను అందించాలన్న లక్ష్యంతో తమ ప్రయా ణం కొనసాగుతోందన్నారు.వైద్య రంగంలో నాణ్యతతో పాటు, అందుబాటు ధరల్లో సేవ లు అందించగల సామర్థ్యం భారతదేశానికి ఉందని విశ్వసిస్తున్నామని తెలిపారు.ఆరోగ్య సేవలు కొంతమందికి మాత్రమే పరిమితమై న ప్రత్యేక హక్కుగా కాకుండా, ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఆశ్రయించగల హామీగా మారాలన్నారు.

ప్రతి కొత్త ఆసుపత్రి ద్వారా ఆ లక్ష్యాన్ని మరింత చేరువ చేస్తున్నామని, ప్ర పంచానికి వైద్యం మాత్రమే కాదు, మానవతలో కూడా భారత్ ముందంజలో నిలిచే భవిష్యత్తును నిర్మిస్తున్నామన్నారు. అపోలో ఆసుపత్రుల జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి  మాట్లాడుతూ, హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ హాస్పిటల్ ద్వారా తదుపరి తరం ఆరోగ్య వ్యవస్థల నిర్మాణంలో భారతదేశం నాయకత్వాన్ని మరింత బలపరుస్తున్నామన్నారు.

నిర్ధారణ నుంచి కోలుకునే దశ వరకు ప్రతి స్థాయిలో ఆధునిక సాంకేతికతను సమగ్రంగా అమలు చేసి,  వైద్య నైపు ణ్యాన్ని సమన్వయం చేస్తున్నామన్నారు. ఈ సదుపాయం ద్వారా క్లిష్ట వైద్య చికిత్సలకు హైదరాబాద్‌ను గ్లోబల్ కేంద్రం గా మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రతి పౌరుడికి ప్రపంచ స్థాయి వైద్య సేవలను సులభంగా అందుబాటులోకి తీసుకు వస్తా మన్నారు.  సీఎస్‌ఆర్ విభాగం వైస్ చైర్పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల నానక్ రామ్‌గూడ ప్రాంత ప్రజలకు ప్రతి ఆదివారం 10వేలు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వ హించనున్నట్లు ప్రకటించారు. ప్రాంతీయ సీఈఓ తేజస్వి వీరేపల్లి మాట్లాడుతూ, ఇది కేవలం ఆసుపత్రి కాదు, భవిష్యత్ ఆరోగ్య వ్యవస్థ. ‘గోల్డెన్ అవర్’లో చికిత్స అందించేందుకు ప్రత్యేక చర్యలు  తీసుకున్నా మన్నారు.