21 May, 2026 | 3:01 AM

పవర్ లిఫ్టింగ్‌లో అనురాగ్ విద్యార్థికి 5వ ర్యాంక్

21-05-2026 01:46 AM

ఘట్‌కేసర్, మే 20 (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం మొదటి సంవత్సరం బి.టెక్ ఏఐఎంఎల్ విద్యార్థి పి. విక్రంను కళాశాల యజమాన్యం అభినందించింది. భారతదేశంలో సబ్ జూనియర్ విభాగంలో ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ర్యాంక్ సాధించిన తొలి పవర్లిఫ్టర్గా విక్రం చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే విక్రం ఐదు సార్లు జాతీయ స్థాయి గోల్ మెడలిస్ట్గా నిలిచాడు.

అలాగే స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్లిఫ్ట్ విభాగాలలో మూడు జాతీయ రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఈ విజయాలు అతని కఠోర శ్రమ, పట్టుదల మరియు క్రీడలపై ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి డాక్టర్ మల్లికార్జున రెడ్డి విక్రంను అభినందిస్తూ, చదువుతో పాటు క్రీడల్లోనూ అద్భుత ప్రతిభ కనబరచడం గర్వకారణమని పేర్కొన్నారు. విక్రం విజ యం ఇతర విద్యార్థులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. విశ్వవిద్యాలయ యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు విక్రం సాధనపై హర్షం వ్యక్తం చేశారు.