Rajiv Gandhi University of Knowledge Technologies బాసర క్యాంపస్‌లో వివాదం: యాజమాన్యానికి విద్యార్థుల సవాల్
25-02-2026 01:16 PM
హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్(Basara IIIT)లో మరో వివాదం చెలరేగింది. యాజమాన్యానికి విద్యార్థి సంఘం సవాల్ విసిరింది. బాసర అమ్మవారి మీద ప్రమాణానికి సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేసింది. ఫీజులు చెల్లిస్తాం.. పరీక్షలు రాస్తాం.. ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చే దమ్ము అధికారులకు ఉందా అంటూ విద్యార్థి సవాల్ చేస్తోంది. సమస్యలపైనే పోరాడుతున్నామని ప్రమాణం చేస్తామని పేర్కొంది. కమీషన్లు తీసుకోవడం లేదని ప్రమాణం చేయగలరా? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
బాసర ట్రిపుల్ ఐటీకి సంబంధించిన మరిన్ని తాజా వార్తల కోసం మా తెలంగాణ వార్తలు విభాగాన్ని సందర్శించండి.




