20 June, 2026 | 4:06 PM

Breaking News

పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •  

పాక్ మధ్య మళ్లీ ఘర్షణ

16-10-2025 02:37 AM

-సరిహద్దు ప్రాంతాల్లో భీకర దాడులు

-పాకిస్థాన్ అవుట్ పోస్ట్‌పై డ్రోన్‌దాడి

-ఇరువైపులా 50 మంది వరకు మృతి

-వందాలది మందికి గాయాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: పాకిస్థాన్ మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. సరిహద్దు ప్రాంతాలు కాల్పులతో మార్మోగుతున్నాయి. పాకిస్థాన్ అవుట్ పోస్ట్ అఫ్గాన్ డ్రోన్‌దాడులు చేసింది. ఈ భీకర దాడుల్లో ఇరు దేశాలకు చెందిన 50 మంది వరకు మృతిచెంనట్టు తెలుస్తోంది. సరిహద్దు వివాదం మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ వైమానిక దళం అఫ్గానిస్తాన్ లోపల దాడులు చేసింది.

కాందహార్‌లోని స్పిన్ బోల్డాక్ జిల్లాలో జరిగిన వైమానిక దాడిలో 15 మంది వరకు మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. పాక్ దాడికి దీటుగా తమ సైన్యం కూడా ఎదురు దాడి చేస్తోందని అఫ్గాన్ తెలిపింది. అఫ్గాన్‌లోని జజాయ్ మైదాన్, షార్కో, ఖైబర్ ప్రాంతాల్లో పాక్ దాడులు చేసింది. దీంతో అప్రమత్తమైన అఫ్గాన్ సైన్యం ప్రతిదాడికి దిగింది. పాకిస్థాన్ అవుట్ పోస్టుపై తాలిబన్లు డ్రోన్ దాడి చేశారు. ఈ దాడుల్లో చాలా మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అలాగే ఎంతో మంది సైనికుల ఆచూకీ ఇప్పటివరకు దొరకలేదట.

స్పిన్ బోల్డాక్ గేట్ వద్ద తాలిబన్, పాకిస్థాన్ దళాల మధ్య జరిగిన కాల్పుల్లో 20 మంది తాలిబన్ సైన్యం మృతి చెందినట్లు పాక్ ఆర్మీ చెబుతోంది. అఫ్గాన్ అయితే 15 మంది పౌరులు చనిపోయినట్లు పేర్కొంటుంది. స్పిన్ బోల్డాక్ ప్రాంతంలో బుధవారం ఉదయం 4 గంటల సమయంలో పాక్ దళాలు, తాలిబన్ల యోధుల మధ్య భీకరపోరు జరిగింది. ఈ పోరాటంలో తాము విజయం సాధించామని, 15 నిమిషాల్లోనే పాక్ సైనికులు లొంగిపోయారని తాలిబన్లు ప్రకటించుకున్నారు.

ఇరువైపులా 50 మంది వరకు మృతిచెందినట్లు, వందలాది మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. భారత్‌కు అఫ్గాన్ దగ్గర కావడాన్ని పాకిస్థాన్ తట్టుకోలేక రగిలిపోతున్నట్లు తెలుస్తుంది. ఆ దేశ విదేశాంగ మంత్రి మన దేశంలో పర్యటిస్తున్న సయంలోనే అఫ్గాన్‌లో పాక్ ఆర్మీ కాల్పులకు దిగింది. ఇరు దేశాల మధ్య పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, శాంతిని పునరుద్ధరించడానికి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వివిధ దేశాల అధినేతలు పిలుపునిచ్చారు. అయితే ౪౮ గంటల కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి.