లింగంపేట ఘోర ప్రమాదంలో మరొక చిన్నారి మృతి
తీరని శోకసంద్రంలో రుద్రంగి
ప్రమాదంలో ఇప్పటికి నలుగురికి చేరిన మృతుల సంఖ్య
రుద్రంగి ఆగష్టు 24(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి లింగంపేట సరిహద్దుల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన రోజునే భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోగా, ఆదివారం రాత్రి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఎండీ హసీనా అనే మహిళ కన్నుమూశారు. కాగా, ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి రింసా ఈరోజు తుదిశ్వాస విడిచింది. దీంతో ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు నలుగురు మృతి చెందగా శామీరా అనే మహిళా ఆసుపత్రి లో చికిత్స పొందుతుంది దింతో రుద్రంగి గ్రామంలో తీరని విషాదం అలుముకుంది.ప్రస్తుతం చిన్నారి ప్రభుత్వ స్కూల్లో పదవతరగతి చదువుతుంది ఆమె మృతికి సంతాపం ప్రకటిస్తూ ప్రభుత్వ, ప్రయివేట్ స్కూల్లకు మధ్యాహ్నం సెలవు ప్రకటించాయి.






