13 August, 2026 | 1:38 AM

మరుగుదొడ్డిలో శిశువు మృతదేహం

13-08-2026 12:18 AM
  1. సదాశివపేట పీహెచ్‌సీలో ఘటన
  2. ఆలస్యంగా వెలుగులోకి
  3. సిబ్బందిపై అనుమానాలు

సదాశివపేట, ఆగస్టు 12: సంగారెడ్డి జిల్లా సదాశివపేట కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ (సీహెచ్‌సీ) లో శిశువు మృతదేహం లభించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు సమాచారం. ఈ ఘటనపై డ్యూటీ డాక్టర్ అనుదీప్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

అయితే శిశువు మృతదేహం మరుగుదొడ్డిలోకి ఎలా వచ్చింది? ఎవరు అక్కడికి తీసుకొచ్చారు? మృతదేహాన్ని గుర్తించే వరకు ఆసుపత్రి సిబ్బంది పర్యవేక్షణ ఏమైంది? అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆసుపత్రిలోని కొందరు సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి.

ఆసుపత్రిలో భద్రతా పర్యవేక్షణ ఎలా ఉంది? సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా?  శిశువు మృతదేహాన్ని గుర్తించిన తర్వాత అనుసరిం చాల్సిన నిబంధనలు పాటించారా? అనే ప్రశ్నలకు ఆసుపత్రి అధికారులు సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై పోలీసుల విచారణ తర్వాత చట్టరీత్యాచర్యలు తీసుకుంటా మని సూపరింటెండెంట్ విజయ శంకర్ తెలిపారు.