ఇక సిద్దిపేటలో విశాల మాల్
- సకుటుంబ సభ్యుల దుస్తులు సరసమైన ధరలకు
- ప్రారంభించిన సినీ నటి నిధి అగర్వాల్
- కస్టమర్లతో కిక్కిరిసిన మాల్
సిద్దిపేట, మార్చి 17 (విజయక్రాంతి): అత్యంత ప్రజా ఆదరణ కలిగిన విశాల షాపిం గ్ మాల్ సిద్దిపేటలో ప్రారంభించడం అభినందనీయమని ప్రముఖ నటి నిధి అగర్వాల్ అన్నారు. సిద్దిపేట ప్రజలకు నాణ్యమైన దుస్తులను సరసమైన ధరలకు అందించేందుకు విశాల మాల్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.విశాల షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా సిద్దిపేటలో సందడి చేసిన నిధి అగర్వాల్ ఐ లవ్ యు సిద్దిపేట్ అంటూ వినియోగదారులను ఉత్సాహ పరిచారు.
పలువురు మోడల్ యువతులు ర్యాంపు వాక్ చేసి విశాల మాల్ వస్త్రాలను ప్రదర్శించారు. అత్యంత ఆకర్షణీయమైన, అందమైన, నాణ్యమైన దుస్తులను అందించడంలో విశాల మాల్ ప్రత్యేకత కలిగి ఉందని తెలియజేశారు. విశాల మాల్ ప్రారంభోత్సవం పురస్కరించుకొని వినియోగదారులతో షాపింగ్ మాల్ కిక్కిరిసిపోయింది.
సకుటుంబ సభ్యులకు అప్డేట్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయంటూ వినియోగదారులు వర్షం వ్యక్తం చేశారు. విశాల షాపింగ్ మాల్ నిర్వాహకులు వేముల విష్ణు, శ్రీనివాస్, వెంక టేశ్వర్లు, వేణుగోపాల్ జాజూ, నవనీత్ బంగ్, శ్రీరామ్ జాజూ, శ్రీధర్ లు మాట్లాడుతూ ప్రతినిత్యం వినియోగదారులకు అందుబాటులో ఉంటూ అత్యాధునికమైన వస్త్రాలను అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.




