15 June, 2026 | 2:48 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

అనుములలో పురాతన శివాలయం

22-03-2026 12:16 AM

తెలంగాణ రాష్ర్టం నల్లగొండ జిల్లాలో ఉన్న అనుముల గ్రామం మండల కేంద్రం. అనుములనే హాలియా అంటారు. అహల్య నది పక్కనే పారుతుంటుంది. పాత అనుముల కొత్త అనుముల మధ్యలో పురాతన శివుని గుడి ఉంది. శిథిలమై మిగిలిన ఏక గర్భగుడిలో ఎత్తున శివలింగం ఉన్నది. గర్భాలయ ద్వారం మీద కలశాలున్నాయి.

ఆ ప్రాంగణంలో విడిశిల్పాలలో చతుర్భుజి చాముండ శిల్పం, ఒక దేవతామూర్తి తల, ద్విభుజుడైన శైవమూర్తి విగ్రహం, చతుర్భుజి మహిషాసురమర్దిని, వేర్వేరుచోట్ల ఇద్దరు చతుర్భజ భైరవులు, వేర్వేరు కాలాలకు చెందిన మూడు నాగశిలలున్నాయి. నంది వాహనంతో జటామకుటధారి, చతుర్భు జుడు, పరహస్తాలలో దండం, నిజహస్తాలలో అభయహస్తంతో అక్షమాల, పుస్తకం, మెడలో హార, గ్రైవేయకాలు, కేయూరాలు, వక్షబంధం, మణిమేఖల, ఉరుడాలు, హస్తాలకు కంకణాలు, కాళ్లకు పాం జీబులు, సుఖాసనంలో ఉన్న దక్షిణామూర్తి శిల్పం ప్రత్యేకం.