త్వరలో అటవీశాఖ స్వాధీనంలోకి అనన్య రిసార్ట్
అటవీశాఖ మంత్రి కొండ సురేఖ
ఎల్బీనగర్, మార్చి 9: వనస్థలిపురం - ఆటోనగర్ ప్రాంతంలో ఉన్న వనస్థలిపురంలోని హరిణవనస్థలి పార్క్‌లోని అనన్య రిసార్ట్‌ను సోమవారం అటవీశాఖ మంత్రి కొండా సురే ఖ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసార్ట్ నిర్వాహణపై అనేక ఫిర్యాదులు రావడంతో మంత్రి కొండా సురేఖ అటవీశాఖ అధికారులతో కలిసి అనన్య రిసార్ట్‌ను తనిఖీ చేసి, రిసార్ట్ నిర్వాహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా రిసార్ట్‌లో గ్రీనరీ, కిచెన్, మురుగుదొడ్లు, స్వీమ్మింగ్ ఫూల్, సమావేశ హాల్ తో పాటు పరిసరాలను పరిశీలించారు. పర్యాటకు లకు కనీస సౌకర్యాలు కల్పించక పోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.... డీర్ పార్కులోని అనన్య రిసార్ట్‌ను పదేండ్లుగా ఒక్క రే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అనన్య రిసార్ట్‌ను త్వరలో అటవీశాఖ స్వాధీనం చేసుకుని ఆధునిక స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్, డీఎఫ్ వో రోహిత్ రెడ్డి, ఎఫ్ డీవో వెంకటయ్య, ఎఫ్‌ఆర్వో సాయి ప్రకాష్, హయత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




