7 June, 2026 | 6:56 PM

కరుడుగట్టిన బిఆర్ఎస్ కార్యకర్త మన శ్రీకాంత్ (బబ్లు)

07-06-2026 04:53 PM

- కెసిఆర్ పై అభిమానంతో చేయిపై వేయించుకున్న పచ్చబొట్టు

- కెసిఆర్ తో పాటు, పద్మాదేవేందర్ రెడ్డి వీరాభిమాని

- పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో చురుకుగా  పాల్గొంటున్న బబ్లు

రామాయంపేట,(విజయక్రాంతి): బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పై మక్కువతో ఆయన వీరాభిమాని మండల పరిధిలోని అక్కన్నపేట గ్రామానికి చెందిన తొమ్మిదవ వార్డు సభ్యుడు బోడ  శ్రీకాంత్ (బబ్లు) కెసిఆర్ పై ఉన్న అభిమానంతో తన చేతిపై టాటూ వేయించుకోవడం జరిగింది. మొదటినుంచి బబ్లు బిఆర్ఎస్ తో పాటు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఇచ్చిన ప్రతి పిలుపులో భాగంగా ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొనడం జరుగుతుంది.

దీంతో అక్కన్నపేట గ్రామంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తొమ్మిదవ వార్డు సభ్యునిగా పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఎన్నికల గెలుపొంది యువ వార్డు సభ్యునిగా సత్తా చాటాడు. దీంతో జిల్లా ముఖ్య నాయకులతో పాటు మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే ఆయనను అభినందించడం జరిగింది. తాను ఎల్లప్పుడూ బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ పార్టీ పెద్దలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని బబ్లు అంటున్నారు.