ఫలితాల్లో ఘన విజయం సాధించిన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ
కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): మారుతున్న అభ్యర్థుల ఎంపిక విధానానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో శ్రద్ధ వహిస్తోంది ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ. విద్యార్థులకు ప్రశ్నల సరళిపై ,కఠినతా స్థాయిలపై అవగాహన పెంపొందేలా ప్రతిరోజు పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారి అభ్యాసన సామర్థ్యాలు పెంచుకునేలా, వారిలోని లోపాలు తెలుసుకుని సవరించుకునేలా గ్రాండ్ టెస్టులని నిర్వహిస్తూ పరీక్షల్లో విజయం సాధించేలా నిష్ణాతులుగా తీర్చిదిద్దుతోంది ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ.
ప్రతి ఒక్కరికి ఒక స్పష్టమైన, నిర్దిష్టమైన లక్ష్యం వుండాలి, దానికోసం నిరంతరం కృషి చేయాలి, చేసే పనిని తపస్సు తో భావించాలి. అప్పుడే ప్రతి ఒక్కరు విజయం సాధించగలరు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ లక్ష్యాలపై దృష్టి పెట్టేలా వాటి సాధనకై నిరంతరం కృషి చేసేలా ప్రోత్సహిస్తూ వారి పరీక్షలకి అనుగుణంగా శారీరక, మానసిక అభ్యాసాలని విద్యార్థులకి అందిస్తుండడం వలన మా అకాడమీ విద్యార్థులు రాత మరియు శారీరక పరీక్షల్లో విజయం సాధిస్తున్నారు.
ఇంతటి విజయానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి, సిబ్బందికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్రంలోనే అత్యున్నత భోధనా ప్రమాణాలతో శిక్షణని అందిస్తూ అన్ని ఆర్మీ ర్యాలీలలో అద్భుత విజయాలు నమోదు చేస్తున్న మా అకాడమీలో సైనిక ఉద్యోగాల ఆశావహులు, నిరుద్యోగులు చేరి ఉద్యోగులుగా మారాలని కోరారు. కొత్త సతీష్ రెడ్డి, చైర్మన్ ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందం మరియు సిబ్బంది పాల్గొన్నారు.






