అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
- బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందులో భాగంగానే జీవో 7ను రద్దుచేసి జీవో 8, 9 తెచ్చిందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రకటన లో అన్నారు. ఎలాంటి మార్పులు లేకుండా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఏవి ధంగానైతే ఈ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేశారో, ఇప్పుడు కూడా పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకా న్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యహరిస్తున్నదన్నారు.
తక్షణమే ఫీజుల రీయింబర్స్‌మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష, విద్యార్థి, బీసీ సంఘా లతో సమావేశం ఏర్పాటు చేయాలని డి మాండ్ చేశారు. తక్షణమే ఫీజుల బకాయిలు విడుదల చేయకుంటే రెండు, మూడు రోజుల్లోనే వేలా దిమంది విద్యార్థులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని జాజుల హెచ్చరించారు.






