భారత రాజ్యాంగంతో ప్రజలకు సమాన హక్కులను అందించిన మహామేధావి అంబేద్కర్
ఘట్ కేసర్, మే 17 (విజయక్రాంతి): భారత రాజ్యాంగంతో ప్రజలకు సమాన హక్కులను అందించిన మహామేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి బక్కని నర్సింగ్రావు అన్నారు. ఘట్కేసర్ పట్టణంలో ఆదివారం ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 266వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి బక్కని నర్సింగ్రావు విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కసారి మనం అంబేడ్కర్ జీవిత చరిత్రను చూసుకుంటే కొందరు ఆయనను ఉన్నత విద్యకు దూరం చేయాలని చూసిన ఆయన అప్పట్లోనే లండన్ వంటి దేశాలలో చట్టం యొక్క విద్యను అభ్యసించి తిరిగి భారత దేశానికి వచ్చి ఎవరైతే పేద, పీడిత ప్రజలు అంటరాని తనం అనుభవిస్తున్నారో ఆ ప్రజలకోసం నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తూ అంటరానితనాన్ని అంతు భట్టించి పేద పీడిత ప్రజలకు దైవం సామనులుగా పూజింపబడ్డారని పేర్కొన్నారు.
డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా మన దేశంలో ఉన్న అన్ని వర్గాలకు కులాలకు న్యాయం జరిగేలా ‘భారత రాజ్యాంగాన్ని ‘ దేశ ప్రజలకు అందించిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలని చైతన్య పరుస్తున్న మీసాల అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ మీసాల మల్లేష్, మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్, అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి ఇరిటపు శ్రీనివాస్, ఉట్కూరి అశోక్ గౌడ్, కట్కూరి నర్సింగ్ రావు, గురజకుంట నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.






