సాకేత్ ఇంజనీర్స్‌పై చర్యలు తీసుకోవాలి
18-05-2026 12:23 AM
పోలీసులకు విల్లాల యజమానుల ఫిర్యాదు
మేడ్చల్, మే 17 (విజయ క్రాంతి): మేడ్చల్ సర్కిల్ గుండ్ల పోచంపల్లి డివిజన్ పరిధిలోని గౌరవిల్లి గ్రామంలోని సాకేత్ ఇంజనీర్స్ యజమానులపై చర్యలు తీసుకోవాలని విల్లాల యజమానులు మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమకు తెలియకుండా తమ విల్లాలను యాజమాన్యం మార్టిగేజ్ చేసి రుణాలు పొందిందని వారు ఫిర్యాదుల పేర్కొన్నారు. 22 ఎకరాల స్థలంలో విల్లాలు ఉన్నాయని తెలిపారు. వీటిని మార్ట్ గేజ్ చేసి సుమారు 89 కోట్ల రూపాయలు రుణం పొందారని బాధితులు తెలిపారు. ఇది ఆర్థిక నేరమని, తమను మోసం చేయడమేనని తెలిపారు. సుమారు 40 మంది బాధితులు పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు.






