తంగళ్ళపల్లిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు
14-04-2026 03:54 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన నివాళులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసంగించిన నాయకులు అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం, సమాన హక్కుల కోసం చేసిన కృషిని గుర్తుచేశారు. సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.






