15 April, 2026 | 1:10 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సామాజిక న్యాయానికి మార్గదర్శి అంబేద్కర్

15-04-2026 12:48 AM

ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 14: సామాజిక న్యాయానికి మార్గదర్శి అంబేద్కర్ అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ్య అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని బాబా సాహెబ్ అంబేద్కర్  జయంతి సందర్భంగా అంబేద్కర్  విగ్రహానికి పులామాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్తగా అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, వైస్ చైర్మన్ బిరిగే రమ్యా రామచందర్, కౌన్సిలర్లు, బబ్బూరి శ్రీధర్ గౌడ్, ముచ్చర్ల మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.