13 March, 2026 | 9:55 PM

పాఠశాలకు ఫర్నిచర్ ను బహుకరించిన పూర్వ విద్యార్థులు

13-03-2026 08:38 PM

- 30 వేల విలువగల ఫర్నిచర్ బహరణ

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కల్మలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1993-94 విద్యాసంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు శుక్రవారం పాఠశాలకు 30 వేల రూపాయల విలువైన ప్రధానోపాధ్యాయుల టేబుల్, గ్లాస్, కుర్చీలను బహుకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిడమర్తి వీరబాబు పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.పూర్వ విద్యార్థులు అందించిన వితరణను ఆదర్శంగా తీసుకొని పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకరించాలని ఆయన కోరారు.