19 May, 2026 | 5:34 PM

పొర్లుదండాలు పెట్టినా బీఆర్ఎస్‌ను ప్రజలు నమ్మరు: మంత్రి వాకిటి

19-05-2026 04:29 PM

హైదరాబాద్: 2014 నుంచి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) జిమ్మిక్కులను బీజేపీ ఎదుర్కోలేకపోయిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Minister Adluri Laxman) గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశం పేర్కొన్నారు. 118 స్థానాల్లో బలమైన అభ్యర్థులను పెట్టలేని స్థితిలో బీజేపీ ఉందని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(Nizamabad BJP MP Dharmapuri Arvind) ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. పొర్లుదండాలు పెట్టినా బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ నేతలను ప్రజలు నమ్మరని వాకిటి వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలు కమీషన్లు వచ్చే పనులు మాత్రమే చేశారని ఆరోపించారు.