3 August, 2026 | 11:43 PM

వరద ప్రభావిత గ్రామాల్లో వైద్య శిబిరాలు

03-08-2026 09:33 PM

ప్రజలకు వైద్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు

అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఉమాదేవి ఆదేశాల మేరకు గోదావరి వరద ప్రభావిత రాంనగర్, పాత చింతిర్యాల గ్రామాల్లో సోమవారం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. అలాగే మండలంలోని అన్ని సబ్‌సెంటర్లలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. తల్లిపాల ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.