22 June, 2026 | 2:59 AM

ఆలయ ఉద్యోగులపై ఆరోపణలు నిరాధారం

22-06-2026 12:00 AM
  1. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు
  2. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ఉద్యోగుల సంఘం

వేములవాడ,జూన్ 21 (విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి దేవస్థాన ఉద్యోగులపై ఇటీవల కొన్ని మీడియా మాధ్యమాల్లో వచ్చిన ఆరోపణలను తెలంగాణ టీఎన్జీవో స్పెషల్ యూనిట్ దేవస్థాన ఉద్యోగుల సంఘం ఖం డించింది. సంఘం అధ్యక్షుడు కూరగాయల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పురాణం వంశీ మోహన్ విడుదల చేసిన ప్రకటనలో ఈ మేరకు స్పందించారు.జూన్ 18న శ్రీ భీమేశ్వరాలయం సమీపంలోని సులభ్ కాంప్లెక్స్ వద్ద దేవస్థానానికి చెందిన భూమిలో ఓ ప్రైవేట్ కిరాయిదారు అనుమతులు లేకుం డా మూడు షెడ్లను నిర్మించిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

దీంతో విధి నిర్వహణలో భాగంగా దేవస్థానం సిబ్బంది సంబంధిత వ్యక్తిని అక్రమ నిర్మాణాలను తొలగించాలని సూచించారని పేర్కొన్నారు.అయితే, ఈ ఘటనకు సంబంధించి దేవస్థాన ఉద్యోగులు తనపై దాడి చేశారంటూ కిరాయిదారు చేసిన ఆరోపణల ఆధారంగా కొన్ని మీడియా సంస్థల్లో వార్త లు ప్రచురితమయ్యాయని తెలిపారు. ఉద్యోగులు ఎలాంటి దాడికి పాల్పడలేదని, కేవ లం తమ విధి నిర్వహణలో భాగంగానే చర్య లు తీసుకున్నారని స్పష్టం చేశారు.దేవస్థాన ఉద్యోగులపై వచ్చిన దాడి ఆరోపణలు పూర్తి గా అవాస్తవమని, నిరాధారమని పేర్కొన్న సంఘం నాయకులు, తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ప్రచురి తమైన వార్తలను సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.