14 April, 2026 | 2:07 AM

మంత్రి సీతక్కపై ఆరోపణలు..బీఆర్‌ఎస్‌కు బుద్ధిచెబుతాం

14-04-2026 12:00 AM

ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవెల్లి వెంకటస్వామి హెచ్చరిక

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): మంత్రి సీతక్క మీద ఆరోపణలు చేసిన మన్నె కృశాంక్, బీఆర్‌ఎస్ సోషల్  మీడియాకు తగిన గుణపాఠం చెబుతామని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవెల్లి వెంకటస్వామి హెచ్చరించారు. అంగన్వాడీ టీచర్లకు చేయూత నిస్తూ, వారికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తే బీఆర్‌ఎస్ నాయకులు జీర్ణించుకోకవడం లేదని మండిపడ్డారు.

మంత్రి సీతక్కపై మన్నెకిశాంక్, టీఆర్‌ఎస్ సోషల్  మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో సోమవారం గాంధీభవన్ ఎదుట దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ స్కాములు,  ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, ప్రభుత్వ సొమ్మును దోచుకోవడం, దాచుకోవడం బీఆర్‌ఎస్ నాయకుల నైజమని విమర్శించారు. బీఆర్‌ఎస్ నాయకులు మంత్రి సీతక్కకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేకుంటే, ఉద్యమాలతో చెబుతామని హెచ్చరించారు.