కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీల వైఫల్యానికి బిఆర్ఎస్ నిరసన
02-09-2026 | 10:02am
తరిగొప్పుల,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని గ్రామ బిఆర్ఎస్ పార్టీ శాఖ అధ్యక్షుడు భోగ శీను ఆధ్వర్యంలో బాకీ కార్డుల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీటీసీ తాళ్లపెళ్లి రాజేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.2500 మహాలక్ష్మి పథకం, రూ.500 కే గ్యాస్ సిలిండర్, రైతులకు రైతు భరోసా, ఆడబిడ్డల పెళ్లికి తులం బంగారం వంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఎన్నికల ముందు గారడీ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తోందని, వెంటనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.






