2 September, 2026 | 10:40 AM

మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసు.. కొనసాగుతున్న దర్యాప్తు

02-09-2026 | 09:52am

హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలో ఉన్న అత్యంత భద్రత గల సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్ లో ఆయుధాల చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఆగస్టు 303వ తేదీన సాయంత్రం 6 నుంచి ఉదయం 7 గంటల్లోపు ఆర్మరీలో చోరీ జరిగినట్లు మద్రాస్ రెజిమెంట్ అధికారులు గుర్తించారు. ఆర్మీ సిబ్బందిలోనే కొందరిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రహరీ సమీపంలోని గడ్డిలో మ్యాగజైన్ పోలీసులకు లభించింది.

దీని ఆధారంగా డాగ్ స్క్యాడ్ ద్వారా సిబ్బందిలో ఓ అనుమానితుడిని గుర్తించి, అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.  ఎస్వోటీ, ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్స్ బృందాలతో దర్యాప్తు చేస్తున్న అధికారులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో 16 మార్గాలు మూసివేసి ఆయుధాల చోరీతో మద్రాస్ రెజిమెంట్ లో అలర్ట్ ను ప్రకటించారు. ఆగస్టు 30న జరిగిన ఈ ఘటనలో 12 రైఫిల్స్, 21 మ్యాగజైన్లు, ఒక నైట్-విజన్ బైనాక్యులర్ తో పాటు 1,912 రౌండ్ల మందుగుండు సామగ్రి అపహరణకు గురైనట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.