31 తర్వాత ఉద్యమబాట
- ఆలోపు సమస్యలు పరిష్కరించాలి
- లేకుంటే అసెంబ్లీ, సచివాలయాన్ని ముట్టడిస్తాం
- ప్రభుత్వానికి ‘తపస్’ఆల్టిమేటం
- ఇందిరాపార్క్ వద్ద ఉపాధ్యాయుల మహాధర్నా
- రేవంత్ సర్కార్‌కు గుణపాఠం తప్పదు
- బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్
హైదరాబాద్/ముషీరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): విద్యారంగం, ఉపాధ్యాయ సమస్యలను ఈ నెల 31లోగా పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సం ఘం (తపస్) డిమాండ్ చేసింది. గడువులోపు ప్రభుత్వం స్పందించకపోతే వేలాది మంది ఉపాధ్యాయులతో ఉద్యమాన్ని ఉధృ తం చేస్తామని, రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించింది. ఉపా ధ్యాయుల సమస్యలు పరిష్కారించాలనే ప్ర ధాన డిమాండ్‌తో తపస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శనివారం ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం నిర్వహించారు.
ఇందులో భా గంగా ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తప స్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వో డ్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య మా ట్లాడుతూ.. ఉద్యోగులకు 1వ తేదీనే వేతనాలిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్ర భుత్వం.. మిగతా సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. కొత్తవి, గొంతెమ్మ కోర్కెలు అడగటం లేదని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే నెరవే ర్చాలని అడుగుతున్నామని తెలిపారు.
సమస్యలపై కొట్లాడే పరిస్థితిని ప్రభుత్వమే తీసు కువచ్చిందన్నారు. కేవలం 1,200 స్కూళ్లల్లో మాత్రమే బ్రేక్‌ఫాస్ట్ స్కీం అమలు చేసి, మూ డు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు నిర్మించి రాష్ట్రమంతా ఇలాగే ఉన్నట్లు గొప్పలు చెప్పుకుం టుందని విమర్శించారు. రేషనలైజేషన్ పేరు తో బడులను మూసివేయడం తగదన్నారు. ఆరు డీఏలు పెండింగ్ ఉండటంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆర్థికంగా నష్టపోతు న్నారని పేర్కొన్నారు. 51 శాతంతో ఫిట్‌మెం ట్ పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను తక్షణమే చెల్లించాలని డి మాండ్ చేశారు.
వీటితో పాటు ప్రత్యేక టెట్ లో ఇన్‌సర్వీస్ టీచర్లకు 40 శాతం మార్కు లు అర్హతగా నిర్ణయించాలని, సమగ్రశిక్ష, కేజీబీవీ మహిళా టీచర్లు, సిబ్బందికి 29 రోజుల సమ్మె కాలపు జీతం చెల్లించాలని, మోడల్ స్కూల్, గురుకులాల్లో 010 పద్దు అమలు చేయాలని కోరారు.
2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేయాలని, సీపీ ఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని, ఉపాధ్యాయుల వార్షిక పదోన్నతులు, బదిలీలకు క్యాలెండర్ విడుదల చేయాలని, సర్వీస్ రూల్స్‌పై ఉన్నతస్థాయిలో కమిటీ వేయాలని స్పష్టం చేశారు. మహాధర్నాలో ఏబీఆర్‌ఎస్‌ఎం జాతీయ సహ సంఘటన మంత్రి గుంత లక్ష్మణ్, ప్రతినిధి సూరం విష్ణువర్ధన్‌రెడ్డి, పర్వతం సంధ్యారాణి, రామకృష్ణారెడ్డి, బండి రమేష్, షేర్ కృష్ణారెడ్డి, వెంకటరమణారావు, దుబాసి భాస్కర్, శ్రీనివాస్‌గౌడ్, ఉదయ్‌కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించిందని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీలు ఏవీఎన్‌రెడ్డి, మల్క కొమురయ్య, అంజిరెడ్డితో కలిసి ఉపాధ్యాయుల ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఉపాధ్యాయుల రిటైర్మెంట్ ప్రయోజనాలు చెల్లించకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీలు ఏవీఎన్‌రెడ్డి, మల్క కొమురయ్య, అంజిరెడ్డి మాట్లాడారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యత అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఇందిరాపార్కు వద్ద ఉపాధ్యాయుల ధర్నాకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలులో రేవంత్‌రెడ్డి విఫలమయ్యారన్నారు.






