2 May, 2026 | 3:15 AM

మత్స్యకారులందరూ మే 23లోపు ఎన్‌ఎఫ్డీపీ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి

02-05-2026 02:07 AM

జిల్లా మత్స్యశాఖాధికారి పి. నరేష్ కుమార్ నాయుడు

పెద్దపల్లి, మే 1(విజయక్రాంతి): జిల్లాలో గల మత్స్య సహకార సంఘాలలో సభ్యత్వం పొందిన మత్స్యకార సభ్యులందరూ తప్పనిసరిగా 23-05-2026 లోగా ఎన్‌ఎఫ్డీపీ (నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫాం) పోర్టల్లో తమ పేరును నమోదు చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖాధికారి పి. నరేష్ కుమార్ నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ద్వారా మత్స్యశాఖకు సంబంధించిన అన్ని పథకాల లబ్ధి పొందేందుకు ఎన్‌ఎఫ్డీపీ పోర్టల్లో నమోదు చేసుకున్నవారే అర్హులవుతారని ఆయన పేర్కొన్నారు. గడువులోగా నమోదు చేయించుకోని సభ్యులకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ (GAIS) పథకం వర్తించదని స్పష్టం చేశారు.

కాబట్టి జిల్లాలోని ప్రతి మత్స్యకార సభ్యుడు నిర్దిష్ట గడువులోగా ఎన్‌ఎఫ్డీపీ పోర్టల్లో నమోదు చేసుకుని, మత్స్యశాఖ చేపట్టే పథకాలతో పాటు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ (GAIS) పథకం ద్వారా లబ్ధి పొందాలని జిల్లా మత్స్యశాఖాధికారి ఆ ప్రకటనలో కోరారు.