1 July, 2026 | 2:16 AM

సీఎం పర్యటన విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

01-07-2026 12:16 AM

కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్

కల్వకుర్తి, జూన్ 30: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉర్కొండలోని పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మంగళవారం ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సదుపాయాల ఏర్పాట్లను సమీక్షించి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం ఉర్కొండపేట జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ప్రతిపాదిత హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. అలాగే ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయ సముదాయం, నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థలాలను సందర్శించి, భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.