12 June, 2026 | 1:22 AM

నిర్మాణరంగ కార్మికులంతా ఐక్యంగా ముందుకు సాగాలి

12-06-2026 12:15 AM

జవహర్ నగర్ భవన నిర్మాణ కార్మికుల నిరవధిక సమ్మె

జవహర్ నగర్, జూన్ 11 (విజయక్రాంతి): భవన నిర్మాణ కార్మికులంతా భేషజాలకు పోకుండా ఐక్యంగా ముందుకు సాగాలని మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. సెంట్రింగ్ కార్మికుల అహంకార వ్యాఖ్యలను నిరసిస్తూ జవహర్ నగర్ భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ హాజరై భవన నిర్మాణ కార్మికులకు మద్దుత తెలిపారు. తాసీమేస్త్రీలు, సెంట్రింగ్ కార్మికులు అన్నదమ్ముల్లా కలిసి పోవాలని సూచించారు. సెంట్రింగ్ కార్మికులు రేట్లు పెంచుతామనడం దారుణమని, పేదలను దృష్టిలో పెట్టుకొని రేట్లనుసవరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బూడిద వెంకటేష్, యాదగిరి,కొయ్యడ వెంకటేష్, దయాకరాచారి. భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.