29 March, 2026 | 6:18 PM

మహిళలందరూ చదువుకోవాలి

29-03-2026 04:16 PM

మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ

సుల్తానాబాద్,(విజయక్రాంతి): మహిళలందరూ చదువుకోవాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగపరుచుకోవాలని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ అన్నారు, ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి అక్షర వికాసం ఉల్లాస్ కార్యక్రమం ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు  చింతకుంట విజయ రమణారావు  ఆదేశాల మేరకు మెప్మా వారి ఆధ్వర్యంలో గ్రూపు  మహిళలలో చదువు రానటువంటి మహిళలను గుర్తించి ప్రభుత్వం నుంచి వారికి బుక్స్ పంపిణీ చేసి వాలంటీర్లచే చదువు చెప్పే కార్యక్రమాన్ని ప్రారంభించారు, మున్సిపల్ పరిధిలోని  2,3,4,5,6,15 వ వార్డు గ్రూప్ మహిళలకు దర్జీ భవన్ లో పరీక్షలు నిర్వహించడం జరిగింది.