బాధితులకు అండగా అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం
06-06-2026 12:20 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): పట్టణంలోని దస్నాపూర్ గ్రామంలో జూన్ ఇటీవల జరిగిన cలో ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన బండె తిరుపతి, బండె సావిత్రిబాయి కుటుంబాలకు అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సహాయం అందజేశారు. పలువురి దాతల సహకారంతో సేకరించిన రూ.23,818లో భాగంగా రూ.5,900 విలువైన వంట పాత్రలు, రూ.6,200 విలువైన నిత్యావసర సరుకులు అందించారు.
బండె తిరుపతి కుటుంబానికి రూ.6,618 నగదు, బండె సావిత్రిబాయి కుటుంబ సభ్యులకు రూ.5,100 నగదు సహాయం చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, సంఘం జిల్లా అధ్యక్షుడు సందీప్ మాట్లాడుతూ అగ్నిప్రమాద బాధితులకు అండగా నిలిచిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు మోహన్ పాల్గొన్నారు.






