వేగంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ
- పక్కగా జనగణన జరగాలి
- జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, జూన్ 5 (విజయక్రాంతి)/నార్సింగ్ : వేగంగా ధాన్యం కొనుగోలు,పక్కాగా జనగణచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నర్సింగ్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని , జన గణనను డిఎంసిఎస్, డిఎస్‌ఓ, ఆర్డిఓ, తాహాసి ల్దార్, జన గణన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్ర తిమా సింగ్ మాట్లాడుతూ.. అత్యంత వేగం గా ధాన్యం కొనుగోలు జరగాలని, ధాన్యం పూర్తి అయిన కేంద్రాల్లోని సిబ్బంది,
వాహనాలు, వస్తు సామాగ్రిని, హమాలిలను ధా న్యం నిలువ ఉన్న కేంద్రాల్లో పని చేయించాలన్నారు. మిల్లులో అతి త్వరగా ధాన్యం అన్లోడింగ్ జరగాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పట్టణ కేంద్రం లో జరు గుతున్న జన గణన పారశీలించి కులగణ ప క్కగా చేయాలన్నారు. జన గణన లో ప్రజల యొక్క సమాచారం పక్కగా నమోదు చేసి ఆన్లైన్ ఆప్ లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి, తహసీల్దార్ గ్రేస్ బహి, మండల అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.






