13 August, 2026 | 2:47 AM

ఘనంగా ఏఐఎస్‌ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం

13-08-2026 01:37 AM

షాద్ నగర్ ఆగస్టు 12 (విజయక్రాంతి): ఏఐఎస్‌ఎఫ్ (91)వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాశ్ నాయక్ ఆధ్వర్యంలో షాద్ నగర్ పట్టణంలోని వీఐఐటి జేఈఈ అకాడమీ జూనియర్ కాలేజ్ లో ఘనంగా జం డా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ ఒక్క జెండా పండుగ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రంగారెడ్డి జిల్లా అధ్య క్షుడు ఎం పవన్ చౌహాన్ పాల్గొని జెండాను ఎగరవేసి అనంతరం మాట్లాడుతూ..

ఏఐఎస్‌ఎఫ్ 1936 ఆగస్టు 12న లక్నోలోని బెనార స్ వర్సిటీలో స్వతంత్ర ఉద్యమంలో విద్యార్థులు ఉద్యమించినప్పటికీ దేశవ్యాప్తంగా జాతీయస్థాయిలో విద్యా ర్థి సంఘం అవసరమని భావించి ఉత్తరప్రదేశ్ డిగ్రీ విద్యా ర్థులు ప్రేమ నారాయణ, భార్గవ్, బాబురుద్దీన్‌లు కలిసి విద్యార్థి సంఘాన్ని స్థాపించా రు. నాటి నుండి విద్యార్థుల సమస్యలపై అ లుపెరుగని పోరాటాలు చేస్తూ 91వ వసం తంలోకి అడుగుపెడుతున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్ అని ప్రస్తావించారు.