8 May, 2026 | 2:23 AM

అగధ గుర్తుండిపోయే సినిమా

08-05-2026 01:07 AM

ఎంఎస్ రాజు రచ న, దర్శకత్వంలో కాశీ విశాలాక్షి బలుసు ‘అగధ’ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయా ళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయరాణిరెడ్డి ముఖ్యపాత్రలను పోషించారు. తాజాగా గురువారం ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. “ఫిలిం మేకర్‌గా నా కలలకు తగ్గట్టుగా నేను ఎన్నో చిత్రాల్ని తీశా. ‘అగధ’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. విజువల్ వండర్‌గా ఈ సినిమా ఉంటుంది” అన్నారు.

‘మా సినిమాని అందరూ చూసి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని నిర్మాత కాశీ విశాలాక్షి అన్నారు. కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ.. “ఈ చిత్రం గురించి మున్ముందు ఇంకా వింటూనే ఉంటారు. కొన్ని సినిమాలు మాత్రమే మనతో నిత్యం ఉండిపోతాయి. ‘అగధ’ అలాంటి ఓ సినిమానే అవుతుంది. మహాదేవి పాత్ర ఎప్పటికీ నాతోనే, నాలోనే ఉండిపోతుంది” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు చిత్రబృందం కూడా మాట్లాడారు.